1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఈనెల 11 నుంచి భారతీయ చలన చిత్రోత్సవం

కెనడాలోని ఒట్టావోలో ఈనెల 11వ తేదీ నుంచి భారతీయ చలన చిత్రోత్సవం ప్రారంభంకానుంది. కెనడా ఫిలిమ్
కెనడాలోని ఒట్టావోలో ఈనెల 11వ తేదీ నుంచి భారతీయ చలన చిత్రోత్సవం ప్రారంభంకానుంది. కెనడా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌తో కలసి భారతీయ హై కమిషన్ నిర్వహిస్తున్న ఈవేడుకల్లో బాలీవుడ్ నూతన జంట అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. భారత 60వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రోత్సంలో షారూఖ్ ఖాన్ ఆల్‌టైం రికార్డ్ చిత్రం 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'కభీహా కభీనా' వంటి చిత్రాలతో పాటు.. 'రంగ్ దే బసంతీ', 'తారారంపం'తో పాటు.. మేటి చిత్రాలను ప్రదర్శించనున్నారు. 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవం 26వ తేదీతో ముగియనుంది.
About Writer
PNR