1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అబ్బో.. బిర్యానీ ఎంత రుచో.. ఇలియాన

అన్ని రకాల వంటకాలంటే తనకు ఇష్టమనీ
అన్ని రకాల వంటకాలంటే తనకు ఇష్టమనీ, చైనీస్ మొగలాయితో పాటు బిర్యానీ రుచులంటే నోరూరుతుందని నటి ఇలియాన అంటోంది. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ క్రాస్ రోడ్డు‌లోని 'ఆల్‌మాస్' బిర్యానీ పాయింట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. రజా నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం 'దేవదాసు'. సెన్సేషనల్ హిట్.

రజా మంచి స్నేహితుడని పేర్కొంది. అందరికీ అందుబాటులోఉండే రేట్లలో మల్టీపుల్ బిర్యానీ పాయింట్‌కు ఇలియానా రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మాస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్టు రజా చెప్పారు. 'దేవదాస్' చిత్రంలో హీరో రామ్‌కు యాంటీగా నటించిన రజా పలు చిత్రాల్లో విలన్‌గా నటించాడు. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న 'ఒక్క మగాడు' చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.
About Writer
PNR