''మైసమ్మ''తో చిందులు వేసిన బ్రహ్మానందం
|
ఆర్.ఎస్.ఫిలింస్ పతాకంపై పోలిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈచిత్రానికి రాజ్‌కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'శివాజీ' గెటప్‌పై బ్రహ్మానందం మాట్లాడుతూ.. రజనీ స్టైల్‌ను ఎవరూ ఇమిటేట్ చేయలేరని, అయినప్పటికీ తాము ఓ చిన్న ప్రయత్నంగా చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో మిమిక్రీ పాట ఖచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుందని నిర్మాత రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో ఉదయకిరణ్ దియా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. తమిళ విలక్షణ నటుడు సత్యరాజ్ ఓ ప్రత్యేక పాత్రలో పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజన్ పి.దేవ్, సెక్సీ బాండ్ షకీలా, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.