మెగాస్టార్ 150వ చిత్రం ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి''.!
|
అయితే ఇటు నటన, అటు దర్శకత్వం బాధ్యతలు చేపట్టడం కత్తిమీద సాములాంటిదేనని భావించిన మెగాస్టార్.. ఆ బాధ్యతలను యంగ్ డైరక్టర్ వివి.వినాయక్‌కు అప్పగించారు. గతంలో చిరంజీవి-వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఠాగూర్' చిత్రం సంచలన విజయం నమోదుచేసుకున్న విషయం తెల్సిందే.
మెగాస్టార్ 150వ చిత్రానికి దర్శకత్వం వహించే గోల్డెన్ అవకాశాన్ని కొట్టేసిన వినాయక్.. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. గతంలో ఎన్.టి.రామారావు హీరోగా వచ్చిన "సర్ధార్ పాపారాయుడు" చిత్రం తరహాలో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.