''దేశముదురు''తో చంటి అడ్డాల సినిమా
Publish: Thu, 9 Aug 2007 (18:12 IST)
Updated: Thu, 9 Aug 2007 (18:12 IST)
తెలుగు వెండి తెరకు పరిచయమైన కొద్దికాలంలోనే స్టైలిష్ హీరోగా ముద్రపడిన అల్లు అర్జున్‌తో చంటి అడ్డాల ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈయన లోగడ నిర్మించిన 'అల్లరిరాముడు', 'అడవిరాముడు', 'ఒక ఊరిలో' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేక పోయాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న చంటి... తాజాగా 'బన్నీ'తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'బొమ్మరిల్లు' ఫేం భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ 'దేశముదురు'తో ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆరంభమయ్యే ఈ చిత్రం షూటింగ్.. వివరాలు మాత్రం త్వరలో వెల్లడికానున్నాయి.