1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మగరాయుడిని తలపించే ముమైత్‌: పూరి

వెండి తెరపై సున్నితంగా కనిపించే సెక్సీక్వీన్ ముమైత్ ఖాన్.. బయట మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తూ.. మగరాయుడిని
వెండి తెరపై సున్నితంగా కనిపించే సెక్సీక్వీన్ ముమైత్ ఖాన్.. బయట మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తూ.. మగరాయుడిని తలపిస్తుందని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. సెట్స్‌లలో ఆమె వ్యవహార శైలిని నిశితంగా గమనించిన తర్వాతనే ఇలా వ్యాఖ్యానిస్తున్నట్టు పూరీ పేర్కొన్నారు. తెలుగులో ఐటం గర్ల్‌గా ప్రవేశించిన ముమైత్.. అతి తక్కువ కాలంలోనే సోలో హీరోయిన్‌ స్థాయికి ఎదిగి, తనలోని సత్తాను నిరూపించుకుందని పూరీ ప్రశంచించారు.

దీన్ని బట్టి చూడగా ముమైత్ తాను ఎన్నుకున్న వృత్తిని ఏ మేరకు ప్రేమిస్తుందో అర్థం చేసుకోవచ్చని జగన్నాథ్ అన్నారు. తొలుత 143 చిత్రంలో ఆమెకు మొదటిసారి అవకాశం కల్పించాలని భావించానని, అయితే ఆమెకు బాడీకి తగిన విధంగా పాటను సమకూర్చలేక పోయానని, అయితే.. పోకిరి చిత్రంలో ముమైత్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించి ఆమె నటనాసౌశల్యాన్ని ఉపయోగించుకోగలిగినట్టు పూరీ జగన్నాథ్ చెప్పారు. ఓ తెలుగు టీవీ ఛానల్‌లో అదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పూరీ ముమైత్ ఖాన్ గురించి పై విధంగా సరదాగా వ్యాఖ్యలు చేశారు.
About Writer
PNR