1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలీవుడ్‌పై దృష్టి సారించిన ''పోకిరి'' చిన్నది

పోకిరి చిత్రంలో తన అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆమితంగా ఆకట్టుకున్న ఇలియానా తెలుగు ఇండస్ట్రీకి నజరానాగా
పోకిరి చిత్రంలో తన అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆమితంగా ఆకట్టుకున్న ఇలియానా తెలుగు ఇండస్ట్రీకి నజరానాగా ఉందనుకుంటుంటే ఆమె కన్ను బాలీవుడ్‌పై పడినట్టు తెలుస్తోంది. గోవా నుంచి వచ్చిన ఈ బీచ్ బేబీ త్వరలో హిందీ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ఇలియానా తెలుగులో మరే సినిమాకూ అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు.

బహుశా హిందీ సినిమాలపై ఉన్న ఆసక్తి వల్లే ఇలా జరిగి ఉండవచ్చని ఫిల్మ్ నగర్ వాసులు అనుకుంటున్నారు. సదాతో 'మొనాలిసా' సినిమా తీసిన కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్ దర్శక నిర్మాతగా తీసే సినిమాలో హీరోయిన్‌గా ఇలియానా నటించనున్నది. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఇలియానకు రూ.85 లక్షలు చెల్లించినట్టు వినికిడి. ఏది ఏమైనా.. పెంచి పోషించిన చిత్ర సీమను కాదని బాలీవుడ్‌ వైపు దృష్టి సారిస్తే... తెలుగు ప్రేక్షకుల సంగతి ఏమి కావాలో ఇలియానే సమాధానం చెప్పాలి.
About Writer
PNR