1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నవదీప్ ప్రేమలో మళయాళ కుట్టి సింధుమీనన్..?

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'చందమామ' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు దర్శకుడు కృష్ణవంశీ
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'చందమామ' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు దర్శకుడు కృష్ణవంశీ మాత్రం కాదు. సినిమాలో ఆలస్యంగా అవకాశం పొందిన మలయాళ కుట్టి సింధు మీనన్ ఇందుకు కారణం. ఈమెగారు సినిమాలో తన హీరో నవదీప్ ప్రేమలో పడిందని సినీ జనాలు అనుకుంటున్నారు.

సింధు మీనన్ నిజంగా ప్రేమలో పడిందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు కానీ నవదీప్ ఏ సినిమాలో నటించినా ఆ చిత్ర షూటింగ్‌లు మాత్రం సంచలన వార్తలనే నమోదు చేసుకుంటాయనే విషయం చందమామతో నిజమయింది.

ఇంతకుముందు హీరోయిన్ అంకిత కూడా నవదీప్‌తో నటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది కానీ అవి లవ్ కు సంబంధించి మాత్రం కాదు. అవి పూర్తిగా నవదీప్‌పై చేసిన ఆరోపణలు. ఏదేమైనా నవదీప్ సినిమాలు విజయం సాధించకున్నా ఆయన చేష్టలు మాత్రం సంచలనం కలిగిస్తున్నాయి.
About Writer
PNR