"రాఘవన్"గా వస్తున్న"వేట్టయాడు విలయాడు"
|
ఈ సందర్భంగా తెలుగు వర్షన్ నిర్మాతలు మాట్లాడుతూ.... తమిళంలో ఈ చిత్రం 20 కోట్లు వసూలు చేసింది. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కమల్ నటించారు. ప్రకాష్‌రాజ్ ఆయనకు సపోర్ట్‌నిచ్చే ఆఫీసర్‌గా నటించారు. కమల్ ప్రేమించిన కమలిని ముఖర్జీ హత్యకు గురికావడంతో ఆ పరిశోధన నిమిత్తం అమెరికాకు వచ్చిన కమల్‌కు జ్యోతిక పరిచయమవుతుంది. ఆ తర్వాత ప్రకాష్‌రాజ్‌తో కలిసి పరిశోధించి విలన్ కుట్రను ఎలా చేధించాడనేది ఈ చిత్ర కథాంశం.
హాలివుడ్ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం 90 శాతం షూటింగ్ అమెరికాలో జరుపుకుంది. ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. ఆదిత్య ద్వారా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ మాటలు సమకూర్చడం విశేషం. ఈ చిత్రానికి పాటలు: వేటూరి వెన్నెలకంటి, సంగీతం: హెరీష్ జైరాజ్, కెమెరా: రవివర్మన్, ఎడిటింగ్: ఆంటోని, ఫైట్స్: స్టన్ శివ, సమర్పణ: మాణిక్యం నారాయణ్, ఎ.పి. హక్కులు: కె.వి.వి. సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్.