యువరత్న బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్
కొంత మంది హీరోయిన్లు నటించిన చిత్రాలు విజయవంతం కాకపోయినప్పటికీ.. అవకాశాలు మాత్రం సాఫీగా వస్తుంటాయి. ఆ కోవలోని హీరోయిన్ల జాబితాలో పార్వతీ మెల్టన్ ఒకరు. 'వెన్నెల' చిత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరాంగికి 'వెన్నెల' చిత్రం పెద్దగా ఇమేజ్‌ను సాధించపెట్టలేక పోయింది. అంతేకాకుండా.. తాజాగా వచ్చిన 'అల్లరే అల్లరి' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయినప్పటికీ.. పార్వతికి అగ్రహీరోల సరసన నటించే అవకాశం బంగారు అవకాశాలు వస్తున్నాయి.
యువరత్న బాలకృష్ణ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందిస్తున్న 'రంగా..పాండురంగా..' చిత్రంలో పార్వతి మెల్టన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో మొత్తం 12 మంది హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో ప్రియమణి, పార్వతి మెల్టన్‌లు ప్రధాన కథానాయికలుగా ఎంపికయ్యారు. అలాగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నిర్మితమవుతున్న కొత్త చిత్రంలో పార్వతి హీరోయిన్‌గా నటిస్తోంది.