1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఎమ్మెస్ రాజు చిత్రం ''వాన''లో మీరా చోప్రా

హీరో పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ మీరా చోప్రా
హీరో పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ మీరా చోప్రా. నిర్మాతలను పలు ఇబ్బందులకు గురి చేస్తుందనే అపవాదును మూటగట్టుకుంది. గతంలో..పారితోషకాన్ని ఇవ్వలేదన్న కారణంగా 'సత్యం శివం సుందరం' చిత్ర నిర్మాతలపై మీరోచోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఎమ్మెస్ రాజు తాజాగా నిర్మించే 'వాన' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో తమిళ హీరో వినయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇదిలావుండగా మీరా చోప్రా తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తుండగా, తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. 'వాన' చిత్రం ఎమ్మెస్.రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందనుంది.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి