జయ "సవాల్" ప్రారంభం
చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనుమడు చిత్రాల దర్శకురాలు జయ.బి దర్శకత్వంలో రూపొందుతోన్న "సవాల్" చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న భరత్, సుహానిపై చిత్రీకరించిన ముహూర్తపుషాట్‌కు దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా, కథానాయకుడు మహేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జయ మాట్లాడుతూ ఇంతవరకు ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలకు దర్శకత్వం వహించాను.
తొలిసారిగా యాక్షన్, సెంటిమెంట్ ఉన్న చిత్రాన్ని తీయమని నిర్మాత తోట వెంకటేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. ఆ మాటను సవాల్‌గా స్వీకరించి చిత్రాన్ని రూపొందిస్తున్నాను. "ఇడియట్", "ఢీ" తరహాలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగే కథాంశమిది. తూనీగా తూనీగా... ఫేమ్ సుహాసిని కథానాయికగా పరిచయం చేస్తున్నాను. అలాగే వినాయక్ విలన్‌గా చూపిస్తున్నాను. టెక్నికల్‌గా మంచి చిత్రాన్ని తీయాలని అరున్‌కుమార్‌ను సినిమాటోగ్రాఫర్‌గా ఎంచుకున్నాను. గాయకుడు, సంగీతదర్శకుడు అయిన జెస్సీగిఫ్ట్ తొలిసారిగా తెలుగు చిత్రానికి పనిచేస్తున్నారు.
భరత్‌కు, షిండేకు మధ్య జరిగే "సవాల్" చిత్రంలోని పాయింట్. ఈ చిత్రం నాకొక సవాల్‌గా స్వీకరిస్తున్నాను. సెప్టంబర్, అక్టోబర్‌లో షూటింగ్ జరిపి నవంబర్‌లో పోస్ట్ ప్రొడెక్షన్ కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఇది ఆద్యంతరం ఎంటర్‌టైన్‌మెంట్‌లోసాగే సినిమా. దర్శకురాలు జయ 74 సీన్స్ బౌండ్‌బుక్‌తో సహా ముందుగా ఇచ్చారు.
కథ నచ్చి వెంటనే నిర్మిస్తున్నాను. అని నిర్మాత తెలిపారు. తొలిసారిగా తాను మాస్ పాత్ర పోషిస్తున్నాననీ, ఇంట్రడక్షన్ సాంగ్ భారీస్థాయిలో చూపించబోతున్నారని హీరో భరత్ అన్నారు. ఈ చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉందని సుహాని చెప్పారు. ఇందులో ప్రతీపాత్రా గమ్మత్తుగా ఉంటూ సవాల్‌గా ఉంటాయని మాటల రచయిత పోలూర్ ఘటికాచలం తెలిపారు.
ఇంకా బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, దండపాణి, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, ఢిల్లీ రాజేశ్వకి తదితరులు నటిస్తున్నారు. శ్రీ సాయిరూపా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి మూలకథ, మాటలు: పోలూర్ ఘటికాచలం, రచనా విస్తరణ, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: జెస్సీ గిఫ్ట్, నిర్మాణ పర్యవేక్షణ: వనపర్తి నరేంద్రబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి. జయ