1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అరకులో "మహారాజశ్రీ" ఆటాపాటా

"మహారాజశ్రీ" చిత్రంలోని పాటల చిత్రీకరణ అరకులో సాగుతోంది. హీరో రిషి, అనుమెహత, నిఖితపై రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ విశేషాలను నిర్మాత డి.ఎస్.రావు తెలియజేస్తూ... ఈ నెల 6 నుంచి రెండో షెడ్యుల్ ప్రారంభించి 21వరకు జరిపాం. దీంతో టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. గురువారం నుంచి (ఈనెల 22) అరకులో పాట చిత్రీకరణ ప్రారంభించాం. భాస్కరపట్ల రాసిన సాహిత్యానికి నిక్సన్ కొరియోగ్రఫీ వహిస్తున్నారు.

హీరోయిన్ బ్రదర్‌గా సాయికుమార్ చేస్తున్న పాత్ర చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. కథాపరంగా చెప్పాలంటే... మొదటి భాగం జోవియల్‌గా సాగుతూ, సెకండాఫ్‌లో ఊహించని మలుపుతో థ్రిల్లింగ్ కలిగిస్తుంది. కథకు సరిపడే టైటిల్ ఇది. దర్శకుడు నివాస్ కథ చెప్పినదాన్ని చెప్పినట్లు తెరకెక్కిస్తున్నారు. కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సెప్టంబర్‌లో ఈ చిత్రానికి సమర్పణ: రాశి, కథ, మాటలు, దర్శకత్వం: ఎస్.ఎస్. నివాస్.
About Writer
WD