1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలీవుడ్‌పై దృష్టిసారించిన జెనీలియా

'ఢీ'
WD PhotoWD
'ఢీ', 'బొమ్మరిల్లు' వంటి చిత్రాల్లో నటించిన జెనీలియాకు తాజాగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ వచ్చింది. 'బొమ్మరిల్లు' చిత్రంలో తన నటనకు ఉత్తమ ఫిలిం‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలోకి రిమేక్ చేయనున్నారు. అందులోనూ జెనీలియా హీరోయిన్‌గా నటించనుంది. ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ సుందరాంగి దృష్టంతా బాలీవుడ్‌పై ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

బోనీకపూర్ నిర్మిస్తున్న అనీజ్ భాజ్మీ చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన నటిస్తోంది. 'గజని' రిమేక్ తర్వాత ప్రారంభమయ్యే ఈ చిత్రానికి అమీర్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల్నీ కూడా జెనీలియా ఆకట్టుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే.
About Writer
PNR