1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ప్రారంభం

బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ప్రారంభం
WD PhotoWD
హిట్ పెయిర్ ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. శ్రావణ శుక్రవారం సందర్భంగా మాదాపూర్ లోని పూరీ జగన్నాథ్ కార్యాలయంలో లాంఛనంగా ఈ షూటింగ్ ను ప్రారంభించారు.

ప్రభాస్, త్రిషలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చిత్ర నిర్మాత కె.ఎస్. రామారావు శ్రేయోభిలాషి డాక్టర్ శ్రీనివాస్ క్లాప్ ఇచ్చారు. కృష్ణంరాజు కెమేరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

ఆర్భాటం లేకుండా సాగిన ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరు నుంచి సాగుతుందని సమాచారం. ఈ కార్యక్రమానికి రాజమౌళి దంపతులు హాజరయ్యారు. ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్ కె. నాయుడు, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, పాటలు: కందికొండ, నిర్మాత: కె.ఎస్.రామారావు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT