స్నేహాన్ని నిర్వచించే "నేస్తమా"
|
ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ, రీ ఎంట్రీతో కొత్త బేనర్‌లో చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. కానీ "నేస్తమా" సబ్జెక్టు బాగా నచ్చింది. కేరక్టర్‌రీత్యా యాక్షన్‌పార్ట్ కొంత ఉంటుంది. ఆనందం, ఆనంద్ చిత్రాలు కలిపితే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంటుంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంది. "టాస్" చిత్రానికి వాడిన హైపర్ కెమెరా ఈ చిత్రానికి ఉపయోగిస్తున్నారు. అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... ఇవాల్టినుంచి సెప్టంబర్ 13వరకు తొలిషెడ్యూల్ జరుగుతుంది.
పిదప 22 నుంచి పూర్తయ్యే వరకు షూటింగ్ జరుగుతుందని తెలిపారు. నిర్మాతల్లో ఒకరైన లంకా శివశంకర్ మాట్లాడుతూ... ఆ మధ్య ఓ టీవీ కార్యక్రమంలో "ఫ్రెండ్‌షిప్" గురించి వచ్చిన ప్రోగ్రామ్ చూశాను. అందులో స్నేహితుల్లో ఒక అమ్మాయికి వచ్చిన ఆపదను తమదిగా భావించి ఎలా పరిష్కరించారన్న అంశం నచ్చింది.
దానిని మూలకథగా తీసుకుని సినిమాచేయాలనే చిన్ననాటి స్నేహితుడు లంకా కరుణాకర్‌తో నిర్మిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నానని అన్నారు. మరో నిర్మాత కరుణాకర్ వ్యాఖ్యానిస్తూ... ప్రపంచంలో స్నేహానికంటే విలువైందిలేదు అన్న పాయింట్‌తో నిర్మిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌డి. జాన్, మాటలు: డి.బి. చారి, సంగీతం: జాయ్ కాల్విన్, సమర్పణ: లంకా బ్రదర్స్.