"యజ్ఞం" ఫ్రేమ్‌తో నితిన్ చిత్రం ప్రారంభం
|
దీనికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లాప్ కొట్టగా, హీరో శ్రీహరి కెమెరా స్విచ్చాన్ చేశారు. సి. కళ్యాణ్ మాట్లాడుతూ, సెప్టంబర్ 6నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్‌లో విడుదల చేయనున్నాం. దర్శకుడు చెప్పిన పాయింట్‌నచ్చి సరిపడ నటీనటుల్ని ఎంపికచేశాం.
చెప్పినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తే "యజ్ఞం" కంటే పెద్ద హిట్ అవుతుంది. సమాజంలో చర్చనీయాంశమైన కథను తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే చక్రి సారథ్యంలో రెండుపాటల రికార్డింగ్ పూర్తయ్యాయి. ఇంకా నాలుగు పాటలు చేయాలి. నాగబాబు, రఘువరన్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. అని చెప్పారు.
యూత్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ అంతా చూసే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు. తనకంటూ ఉన్న ఆలోచనలతో ముందుకు సాగే పాత్ర తనదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పారు. కెమెరా: జవహర్ రెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాతలు: పత్స నాగరాజు, సి.వి.రావు.