1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

దర్శకనిర్మాతలకు నోటీసులు పంపిన నటి సిమ్రాన్

WD PhotoWD
"ఉన్న నాలికకు మందిస్తే.. కొండనాలుక ఊడిన" చందంగా... అసలే చిత్రం పరాజయంతో నష్టాన్ని మూటగట్టుకున్న ఆ నిర్మాతకు.. చిత్ర హీరోయిన్ పంపిన నోటిసును చూసి ఖంగుతిన్నారు. తన పరువుకు హాని కలిగించారని, అందువల్ల 20 కోట్ల రూపాయల నష్టంపరిహారం చెల్లించాలని అందులో పేర్కొంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? పెళ్లికాకమునుపు తెలుగు, తమిళంలో అగ్ర హీరోయిన్‌గా వెలిగిన నటి సిమ్రాన్. తల్లి అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో హార్ట్ బీట్ అనే చిత్రంలో సిమ్రాన్ నటించింది.

ఇందులో ఆమె ఎయిడ్స్ రోగిగా పాత్రను పోషించింది. చిత్ర నిర్మాణం సగంలో ఉండగానే నిర్మాతలతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె నటించకుండా చిత్రం నుంచి తప్పుకుంది. అయితే ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సిమ్రాన్‌కు నిర్మాత ఆరు లక్షల రూపాయలు చెల్లించారు. అయితే.. చిత్రం విడుదలైన తర్వాత పరాజయం పాలైంది.

సిమ్రాన్ పాత్రను మధ్యలోనే చనిపోయినట్టు చూపించారు. ఇక్కడే ఆమెకు కోపం వచ్చింది. తన పాత్రను దారుణంగా చిత్రీకరించి, తన పరువుకు నష్టం కలిగించారని సిమ్రాన్ ఆరోపిస్తూ న్యాయవాది సలహా మేరకు 20 కోట్ల రూపాయలను నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత దర్శకులకు నోటీసులు పంపించిందట.
About Writer
PNR