గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » రజనీ తదుపరి చిత్రం "చక్రవర్తి"..?
కథనాలు
Feedback Print Bookmark and Share
 
'శివాజీ'తో భారత చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి "చక్రవర్తి" అని నామకరణం చేసినట్లు కోలీవుడ్ బోగట్టా. మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో దాదాపు 17 సంవత్సరాల క్రితం విడుదలై అప్పట్లో రికార్డ్ సృష్టించిన "దళపతి" చిత్రం స్థాయిలో త్వరలో సెట్స్‌ మీదకు వెళ్ళే చిత్రం 'చక్రవర్తి' ఉండవచ్చునని విశ్వసనీయవర్గాల సమాచారం.

'చక్రవర్తి' చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఈ సంవత్సరం కోలీవుడ్‌లో హిట్‌ చిత్రాలను అందించిన ముగ్గురు దర్శకుల పేర్లను రజనీకాంత్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తాజా చిత్రానికి రజనీకాంత్ స్వీయనిర్మాణ బాధ్యతలను చేపట్టవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇదిలావుండగా సంచలనాత్మక చిత్రంగా రికార్డులు సృష్టిస్తున్న "శివాజీ" చిత్రాన్ని హిందీలోకి చిత్ర నిర్మాతలు డప్‌ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ పర్యవేక్షణలో జరుగుతున్న డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తికాగానే దీపావళి నాటికి బాలీవుడ్‌లో హిందీ "శివాజీ"ని విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది.