1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కాశ్మీర్ భూతల స్వర్గమంటున్న ఇ.వి.వి.

కాశ్మీర్ భూతల స్వర్గమని దర్శకుడు ఇవివి.సత్యనారాయణ అంటున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'వెళ్లింయింది
WD PhotoWD
కాశ్మీర్ భూతల స్వర్గమని దర్శకుడు ఇవివి.సత్యనారాయణ అంటున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'వెళ్లింయింది కానీ..' చిత్రం షూటింగ్ ఇటీవలే కాశ్మీర్‌లో చిత్రీకరించారు. ఈ షూటింగ్ ముచ్చట్లను ఇవివి శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చిత్రంలోని మూడు పాటలను ఫారిన్‌లో చిత్రీకరించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నాం. అయితే.. అక్కడ ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు ఉందని మా ఏజెంట్ చెప్పడంతో స్వేదేశంలోనే చిత్రీకరించాలనే ఆలోచన వచ్చింది.

ఇందుకు కాశ్మీర్ అయితే.. ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందీ కానీ.. అక్కడ తీవ్రవాదుల గొడవ ఉండటంతో వెనకడుగు వేశాం. అయితే.. ఏజెంట్ ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగం. కాశ్మీర్ అందాల గురించి వర్ణించటానికి మాటలు చాలవు. ఇప్పటివరకు యాభై సినిమాలు చేశాను. అయితే.. కాశ్మీర్‌లో ఎపుడూ షూటింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందాలు కాశ్మీల్ లోయల అందాలు ముందు వేస్ట్. మన నిర్మాతలందరికీ నా సలహా ఒక్కటే.. నిర్మాతలందరూ కాశ్మీర్‌లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నాను.

ఒక్కో సారి షూటింగ్ ఎక్కడ చేయాలో అర్థంకాదు. షూటింగ్‌ జరిగే సమయంలో కాశ్మీర్ ప్రజలు కూడా ఎంతో సహకారం అందించారు. తన తాజా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. రీరికార్డింగ్, డీటీఎస్ కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ చిత్రం ఆడియోను ఈనెల 25వ తేదీన విడుదల చేస్తామన్నారు.

వచ్చే నెల 12వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో పెళ్లయిన యువతిగా కమిలినీ ముఖర్జీ నటించగా.. పెళ్లయిన తర్వాత ఏమి జరిగిందనేదే చిత్ర కథ అని ఇవివి వివరించారు. ఈ చిత్రానికి కథ..కె.భాగ్యరాజా, కెమెరా.. ప్రసాద్ బాబు, సంగీతం.. కమలాకర్, జయశ్రీ, నిర్మాత.. నరహింహారావు, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. ఇవివి.సత్యనారాయణ.
About Writer
PNR