హీరో అభి తాజా చిత్రం ''సన్ని'' ఆడియో విడుదల
|
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. చిన్ని చిత్రాలు విజయవంతం అయితేనే మరింత మందికి పని లభిస్తుందన్నారు. నిర్మాత తన కుమారుడిపై ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించడం అభిందనీయం. ఈ చిత్రానికి ఇసైమేధావి ఇళయరాజా సంగీతం ఓ హైలెట్‌గా నిలుస్తుంది. దర్శకుడు, హీరో కమలాకర్ మాట్లాడుతూ.. స్క్రీన్‌ప్లేకు రఘుగారే సహకించారనీ, ఈ చిత్రం ఆడియో ఉత్తమ ఆడియోగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మా తొలి చిత్రం 'అభి'. ఆ తర్వాత తన కుమారుడు 'అభి' రుచిమేరకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇళయరాజా సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.