రీ- రికార్డింగ్‌ను పూర్తి చేసుకున్న "హైవే"
|
కథాపరంగా చెప్పాలంటే... జాతీయరహదారిపై వీరంతా ఓ పనిమీద వెళుతుండగా, ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత సాగే గమనమే ఈ చిత్రమని దర్శకుడు వి. మనోజ్‌కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని డి.ఎ.ఆర్. స్టూడియోలో పోస్ట్ ప్రొడెక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మనోజ్‌కుమార్ మాట్లాడుతూ... ఇప్పటికే ఈ చిత్రం రీ- రికార్డింగ్ పూర్తి చేసుకుందని చెప్పారు.
బుధవారం నుంచి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. వచ్చే వారంలో ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. టెర్రరిజం నేపథ్యంలో సాగే కథ ఇదని మనోజ్ తెలియజేశారు. ఇందులోని సంఘటనలు ఇటీవలే హైదరాబాద్‌లో చేసుకోవడం కథ అంచనాలకు తగినట్లుందనీ, టెర్రరిజం రూపుమాపే చర్యలో భాగమే ఈ చిత్రమని పేర్కొన్నారు.