ఇందండీ.. టాబు ''ఇదీ సంగతి''
అందాలనటి టాబు ప్రధాన పాత్రలో చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'ఇదీ సంగతి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యువ హీరోలు రాజా, అబ్బాస్‌లు ఈ చిత్రంలో నటించనున్నారు. పతంజలి రచించిన 'నువ్వే కదూ' అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్న, ఈ చిత్రం షూటింగ్ ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది.
చంద్ర సిద్ధార్థ లోగడ నిర్మించిన 'ఆ నలుగురు' చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా చాలా కాలం తర్వాత టాబు తెలుగు చిత్రంలో నటించేందుకు అంగీకరించడం గమనార్హం. చంద్ర సిద్ధార్థ చెప్పిన కథ ఆమెకు నచ్చడంతో ఇదీ సంగతి చిత్రంలో నటించేందుకు అంగీకరించిన విషయం తెల్సిందే.