1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రెండు పాటలు మినహా ''తులసి'' పూర్తి

విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్, మలయాళ ముద్దుగుమ్మ నయనతార హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తులసి'. ఈ చిత్రం షూటింగ్ రెండు పాటలు మినహా మిగిలిన టాకీపార్టంతా పూర్తయింది. సురేష్ ప్రొడక్షన్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మిగిలిన రెండు పాటలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరించనున్నారు.

'లక్ష్మీ' చిత్రం తర్వాత వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలాఖరులో విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే నెలలో ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం 'అతిథి' విడుదల కానుండటంతో 'తులసి' చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు.. మాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు.
About Writer
PNR