1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ కొత్త చిత్రం?!!

"శివాజీ" చిత్రంతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని రూపొందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. ఎవిఎం, రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లోని భారీ బడ్జెట్ చిత్రం "శివాజీ" అటు నిర్మాణంలోనూ, ఇటు కలెక్షన్ల విషయంలోనూ పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

కమల్‌హాసన్ నిర్మాతగా, మణిరత్నం దర్శకుడిగా శివాజీని బీట్ చేసే విధంగా కొత్త చిత్రాన్ని ప్రేక్షకులను అందించే దిశగా కె.ఎస్.రవికుమార్, మణిరత్నం వంటి పేరొందిన దర్శకుల వేటలో రజనీ కాంత్ దిగినట్లు కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారాల్ని బట్టి తెలుస్తున్నాయి.

మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో రజనీ చిత్రం "చక్రవర్తి" అనే పేరుతో రూపొందనుందని కోలీవుడ్ వర్గాల నుంచి ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో కమల్‌హాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నట్టు, రజనీకాంత్, కమల్ హాసన్‌‌లు మణిరత్నం దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని వినికిడి.
About Writer
PNR