1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అమెరికాలో ముందుగానే విడుదలకానున్న ''హ్యాపీడేస్''

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపీడేస్'. ఈ చిత్రంలో ఏడుగురు కుర్రాళ్లను నటీనటులుగా ఎన్నుకున్నారు. పూర్తిగా కళాశాల నేపథ్యంలో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపీడేస్'. ఈ చిత్రంలో ఏడుగురు కుర్రాళ్లను నటీనటులుగా ఎన్నుకున్నారు. పూర్తిగా కళాశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగులో వచ్చే నెల రెండో తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత 'దిల్' రాజు తెలుగు హక్కులను పొందారు. అయితే ఈ చిత్రాన్ని అమెరికాలో తెలుగు విడుదల తేదీ కంటే నాలుగు రోజులు ముందుగానే విడుదల చేయనున్నారు.

సాధారణంగా.. రాష్ట్రంలో విడుదలైన తర్వాత విదేశాల్లో విడుదల కావడం సహజం. ప్రస్తుతం కాలంలో పెరుగుతున్న ఓవర్సీస్ మార్కెట్ దృష్ట్యా అమెరికాలో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిపై 'దిల్' రాజు మాట్లాడుతూ.. సకుటుంబసమేతంగా చూసేలా చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ చిత్రంలో కొత్త నటీనటులు తమన్నా, వరుణ్, సందేశ్, నిఖిల్, రాహుల్, వంశీకృష్ణ, గాయత్రి రావ్, మొనాలి చౌదరి, సోనియాలు నటిస్తున్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి