''గీత'' ఆడియో విడుదల
రిషీ, శ్రీయజ, హంసానందిని హీరోయిన్లుగా కన్‌ఫ్యూజన్ పతాకంపై 'గీత' అనే చిత్రం రూపొందుతోంది. సూర్యతేజ దర్శకత్వంలో డాక్టర్ రవికుమార్ పంపన, కె.హరినాథ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను విడుదల చేసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. దర్శకుడు చక్కగా సినిమా తీస్తే బాగా ఆడుతుంది. హీరోను చేసేదే దర్శకుడు.
కథలో సత్తావుంటే.. దాన్ని చక్కగా తెరకెక్కించే బాధ్యత దర్శకుడిదే. అనంతరం రిషీ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. రెండు పాటలు మినహా చిత్రం షూటింగ్ పూర్తయింది. నా కెరీర్‌లో మంచి చిత్రం అవుతుందని భావిస్తున్నా అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన కె.హరినాథ్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. మూడు భగవద్గీతాలున్నాయి.
కథకు తగినట్టుగా వీటిని జొప్పించామన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నూతన్ ప్రసాద్, చిత్రం శీను, శ్రీనివాసరెడ్డి, విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు వీరపోతన, ఎడిటింగ్ కేశవ్, పివి.నరసింహారావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సూర్యతేజ.