"తులసి" ఆడియో విడుదల
విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్లో రూపొందుతోన్న తులసి ఆడియో ఆవిష్కరణ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె. రాఘవేంద్రరావు విచ్చేసి ఆడియోను ఆవిష్కరించి రామానాయుడుకు అందించారు. అనంతరం ఆడియో సీడీని డా. డి. రామానాయుడు ఆవిష్కరించగా ఈ చిత్రంలో ఐటంసాంగ్ చేస్తోన్న నటి శ్రియ అందుకుంది. వెంకటేష్, శ్రియపై శనివారంనాడు ఓ సాంగ్‌ను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ... చాలా కాలం తర్వాత స్వంతబేనర్‌లో నటిస్తున్నానని చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరించే చిత్రంగా "తులసి" చిత్రం అవుతుందని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి చక్కని సంగీతం సమకూర్చారని చెప్పారు.
ఈ సందర్భంగా దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.... తొలిసారిగా సురేష్ ప్రొడెక్షన్స్‌లో పనిచేస్తున్నాననీ, అందులోనూ వెంకటేష్ చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సురేష్ ప్రొడెక్షన్స్‌లో పనిచేసిన టెక్నీషియన్స్ ఫోటోల సరసన తనది కూడా తెరకెక్కబోతున్నందుకు ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
రామానాయుడు మాట్లాడుతూ... దేవీశ్రీప్రసాద్ నాన్నగారు సత్యానంద్ మా సంస్థకు "దేవత" వంటి విజయవంతమైన కథ ఇచ్చి నష్టాల్లో ఉన్న సురేష్ ప్రొడెక్షన్స్‌ను స్థిరపడేలా చేశారన్నారు. వెంకటేష్ చిత్రచిత్రానికి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, ఇటీవలే నటించిన "లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటూ, తులసి చిత్రం మరో ఉదాహరణ అని చెప్పారు.
నటి శ్రియ మాట్లాడుతూ... ఈ సినిమాలో తానూ ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందనీ, దేవీశ్రీ సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రామానాయుడుగారు శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని తీశారు. అందులో బంగారం ఒక పక్క తులసి ఆకు మరో పక్క ఉంటాయి. తులసిఆకుతోనే త్రాసు పైకి లెగుస్తుంది. ఈ తులసి సినిమాకూడా అంతరేంజ్‌కు వెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అలీ, కె. ఎల్. నారాయణ, రాజు సుందరం, గీత రచయితలు చంద్రబోస్, సాహితీ, భాస్కర పట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.