వచ్చే నెల 12న "వియ్యాలవారి కయ్యాలు"
ఉదయ్ కిరణ్, నేహాజుల్క హీరోహీరోయిన్లుగా లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం "వియ్యాలవారి కయ్యాలు". ఈ చిత్రానికి సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని వచ్చేనెల ఐదో తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌తేజ్ నటించిన "చిరుత" చిత్రాన్ని ఈనెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో వియ్యాలవారి కయ్యాలు చిత్రం విడుదలను వాయిదా వేశారు.
దీనిపై లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. చిరంజీవిపై ఉన్న గౌరవంతో తమ చిత్రం విడుదలను ఐదో తేదీ నుంచి 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఉదయ్‌కిరణ్, శ్రీహరి కాంబినేషన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన తమ చిత్రం ఎపుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.