1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హాలివుడ్ ఛాన్స్ కొట్టేసిన నగ్మా

కొంతకాలం పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో చెట్టాపట్టాలు వేసుకుని సీనియర్ నటి నగ్మా
WD PhotoWD
కొంతకాలం పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో చెట్టాపట్టాలు వేసుకుని సీనియర్ నటి నగ్మా.. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్‌' కోర్సులో చేరి స్వాంతన పొందిన విషయం తెల్సిందే. ఈ స్వాంతన ఫలితమో ఏమో గాని.. ఆమెకు అదృష్టం తలపు తట్టింది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో అవకాశాలు లేక 'భోజ్‌పురి' చిత్ర రంగంలో స్థిరపడిన ఈ భామ తాజాగా ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనుంది.

క్రిస్టియన్ మిషనరీల చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో ప్రముఖ హాలీవుడ్ నటుడు హీరోగా నటించనున్నట్టు వినికిడి. ఇప్పటికే.. బాలీవుడ్ నటీమణులు ఐశ్వర్యారాయ్, సెలీనా జైట్లీ, మల్లికా షెరావత్, శిల్పాశెట్టిలకు హాలీవుడ్ అవకాశాలు లభించిన విషయం తెల్సిందే. వీరి జాబితాలో తాజాగా నగ్మా కూడా చేరనుంది. సో... ఈ వార్త నగ్మాకు శుభవార్తే.
About Writer
PNR