1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

స్వంత బ్యానర్‌లో నటిస్తున్న సుమంత్

స్వంత బ్యానర్‌లో నటిస్తున్న సుమంత్ కాజల్ అగర్వాల్
WD PhotoWD
'మధుమాసం' సినిమా తర్వాత సుమంత్ సొంత నిర్మాణ సంస్థలో నటిస్తున్నాడు. ఎస్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో అతని తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్ర సిద్దార్థ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.

'లక్ష్మీ కల్యాణం', 'చందమామ' చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కుటుంబ కథా అంశాలతోపాటు కొద్దిగా యాక్షన్ అంశాలు కూడా ఈ చిత్రంలో ఇమిడి ఉన్నాయి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT