1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తమిళంవైపు మహేష్ దృష్టి!

తమిళంవైపు మహేష్ దృష్టి
ప్రిన్స్ మహేష్‌బాబు ప్రస్తుతం ఓ తమిళ చిత్రంపై దృష్టిసారించాడని విశ్వసనీయ సమాచారం. ఆయన తెలుగులో నటించిన ఒక్కడు, పోకిరి చిత్రాలను తమిళంలో విజయ్ నటించగా అవి అక్కడా సూపర్ హిట్‌ కావడంతో పాటు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. దీంతో విజయ్, మహేష్‌బాబు స్నేహితులుగా మారిపోయారు. వారిద్దరు నటించిన చిత్రాల్ని ఒకరివొకరు చూసుకోవడం జరుగుతుంది.

తాజాగా విజయ్ తమిళంలో నటిస్తున్న అళగియ తమిళ్ మగన్ (ఎటిఎం) కథను టూకీగా మహేష్‌కు వినిపించినట్లు సమాచారం. అది విన్నవెంటనే మహేష్‌బాబు కూడా ఆ సినిమాను చేయాలనుకున్నాడు. దీంతో తెలుగు రీమేక్ హక్కుల్ని తన స్నేహితుడిని ఇప్పించాలనే విజయ్ ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం.
About Writer
Selvi