తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న "రుద్ర"
కిరణ్‌తేజ్, రాజీవ్ కనకాల హీరోలుగా చాహత్, హంసి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "రుద్ర". బిట్టు ప్రొడెక్షన్స్ పతాకంపై టి. హరికుమార్ సహనిర్మాతగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంతో పైడాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ తారాగాణంతో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతుంది.
ప్రస్తుతం ఈ చిత్రం తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ వర్క్ జరుపుకుంటుందని సహనిర్మాత టి. హరికుమార్ తెలిపారు. కథానుగుణంగా ఈ నెల 10 నుంచి స్విట్జర్లాండ్, మలేషియాలో రెండు ఫైట్స్, సీన్స్, మూడు పాటలను చిత్రీకరించామని ఆయన చెప్పారు. చక్రి స్వరపర్చిన బాణీలు ఈ చిత్రానికి ప్రధానాకార్షణలుగా నిలుస్తాయని నిర్మాత పైడాల శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ చిత్రంలో శివాజీ రాజా, చంద్రమోహన్, ఎం. ఎస్. నారాయణ, అలీ, ప్రదీప్ రావత్, దువ్వాసి మోహన్, చిన్నా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: వరికూటి శివ ప్రసాద్, పాటలు: భాస్కరపట్ల, కందికొండ. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోసంగి సుబ్బారావు.