ఆచితూచి అడుగులు వేస్తున్న ''మెగాస్టార్''
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టు కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా వచ్చిన 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైన విషయం తెల్సిందే. దీంతో తన తదుపరి చిత్రంపై ఆయన అత్యంత శ్రద్ధ కనపరుస్తున్నారు. ఈ చిత్రం చిరు నటించే 149వ సినిమా కావడం విశేషం.
అందువల్ల దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపడమే కాకుండా.. తగ్గిన తన ఇమేజ్‌ను తిరిగి సంపాదించేందుకు ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందులోభాగంగానే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీకి దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'వందేమాతరం' అనే పేరును పరిశీలిస్తున్నట్టు రాజధాని ఫిల్మ్ వర్గాల సమాచారం.
అలాగే చిరు 150వ చిత్రానికి కూడా సంతకాలు చేశారు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై నిర్మించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ చిత్రం స్క్రిప్టు బాధ్యతలను తమిళ కథా రచయితలైన భూపతి, కృష్ణస్వామి, వల్లరసులకు అప్పగించినట్టు సమాచారం.