''నేనింతే'' అంటున్న ''ఇడియట్''
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రవితేజలది ఓ ప్రత్యేక శైలి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే చిత్రాల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా రవితేజ కోసం పూరీ ఎన్నుకునే సినిమా టైటిల్స్, కథ అన్నీ ప్రత్యేక శైలిని సంతరించుకున్నాయి. లోగడ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్', తాజాగా 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణలు.
ప్రస్తుతం 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' అనే చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత రవితేజతో 'నేనింతే' అనే చిత్రాన్ని నిర్మించేందుకు పూరీ ప్లాన్ చేశారు. ఇందుకోసం చిత్ర టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. వైష్ణో అకాడెమీ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంకానుంది.