సద్దుమణగని ''యమదొంగ'' ప్రింట్ల గొడవ
స్టార్ హీరోల కలెక్షన్లు, ఎక్కువ ప్రింట్ల గొడవ రోజురోజుకు ముదిరి పాకాన పడుతోంది. ఇటీవలే మెగాస్టార్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య అమలాపురంలో రగిలిన గొడవ సద్దుమణగక ముందే.. తాజాగా మరో గొడవ ఆరంభమైంది. 'యమదొంగ' ప్రింట్లు 265 అని ఓ సినీ పత్రిక ప్రచురించింది. దీంతో.. ఆగ్రహంతో రగిలి పోయిన ఎన్టీఆర్ అభిమానులు ఆ పత్రిక కార్యాలయంపై దాడి చేసి, కార్యాలయానికి తాళం వేశారు.
ఈ విషయం తెలుసుకున్న పత్రికా కార్యాలయ యజమాని ఖంగుతిన్నాడు. వెంటనే 'యమదొంగ' చిత్రం దర్శకుడు రాజమౌళిని సంప్రదించి రాయబారానికి వచ్చారట. అంతేకాకుండా.. అభిమానుల కోరిక మేరకు వచ్చే సంచికలో 'యమదొంగ' ప్రింట్లు 400 అని ప్రచురించాలని భావించారు. ఇదిలావుండగా.. 'యమదొంగ' అర్థశతదినోత్సవాన్ని ఈనెల 14వ తేదీన గుంటూరులో అట్టహాసంగా నిర్వహించనున్నారు.
అభిమానుల సమక్షంలో జరిగే ఈ ఫంక్షన్‌లో హీరో ఎన్టీఆర్ స్వయంగా డాన్స్ వేసి ఆలరించనున్నారు. ఈ సందర్భంగానే ఆ చిత్రం మాటల ఆడియో క్యాసెట్‌ను కూడా విడుదల చేయనున్నారు. మరో విశేషమేమిటంటే.. గతంలో మెగాస్టార్ నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రం ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది. దీనికి ధీటుగా ప్రస్తుతం 'యమదొంగ' చిత్రాన్ని నిర్వహించేందుకు నిర్మాత ప్లాన్ చేశారు.