తరుణ్ సరసన ''పోకిరి'' భామ
|
ఈ నేపథ్యంలో యువహీరో తరుణ్‌తో ఓ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం కథ నచ్చడంతో యువ హీరోతో సీనియర్ నటుడు నటించేందుకు అంగీకరించారని వినికిడి.
అలాగే.. ఇలియానా కూడా చిత్ర కథ నచ్చడంతో అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. లోగడ విజయభాస్కర్-తరుణ్ కాంబినేషన్‌లో 'నువ్వే నువ్వే' చిత్రం వచ్చింది. తాజాగా నిర్మించనున్న చిత్రం షూటింగ్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.