1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తారా స్థాయిలో ఇలియానా పారితోషకం!

తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక పారితోషకం హీరోయిన్లు 'పోకిరి' భామ ఇలియానా అగ్రస్థానం
FileFILE
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో 'పోకిరి' భామ ఇలియానా అగ్రస్థానంలో ఉంది. ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణాది చిత్ర సీమలోనే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఆమె కావడం గమనార్హం. 'దేవదాసు', 'పోకిరి' చిత్రాలు సిల్వర్ జూబ్లీ హిట్లతో ఇలియానా రేటు ఆమాంతం పెరిగి పోయింది.

అంతేకాకుండా ఆమె రేంజ్‌ కూడా తారాస్థాయికి చేరింది. అయితే.. ఆమె రవితేజతో నటించిన 'ఖతర్నాక్', 'రాఖీ' చిత్రాలు ఓ మోస్తారు విజయాన్ని సొంతం చేసుకోవడం, 'ఆట' కేవలం ఆటవిడుపు చిత్రాలుగా ముద్ర వేసుకున్నప్పటికీ.. ఇలియానా రేంజ్ ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తీస్తున్న చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా తరుణ్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మించే చిత్రాన్ని అంగీకరించారు. ఈ చిత్రంలో ఆమె రేటు రూ.కోటి కావడం వల్లే అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల భొగొట్టా.
About Writer
PNR