గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ప్రొడక్షన్ వైపు వేణుమాధవ్ దృష్టి
కథనాలు
Feedback Print Bookmark and Share
 
హాస్యనటులు హీరోలుగా మారడం సహజం. అలా అయిన వాళ్ళే ఆలీ, సునీల్, బ్రహ్మానందం. తాజాగా "జాన్ అప్పారావు 40+"తో కృష్ణభగవాన్ కూడా ఇదే బాటలో హీరో అయినవాడే. ఇక బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణలు తమ కుమారుల్ని హీరోలుగా చేయడం కోసం నిర్మాతలుగా అవతారం ఎత్తారు.

మరోవైపు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏవీఎస్‌లకు ఇంకా దర్శకత్వ తృష్ణ తగ్గనేలేదు. మరి "హంగామా", "భూకైలాస్"లతో హీరోగా అందరికీ తెలిసిన వేణుమాధవ్ మాత్రం ప్రొడక్షన్ వైపు దృష్టి మరల్చాడు. తాజాగా ఆయనే హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

పక్కా కామెడీ కథతో రూపొందే ఈ చిత్రకథను స్క్రిప్ట్ రెడీకి తుది మెరుగులు దిద్దుకుంటోంది. దీనికి దర్శకుడిగా "స్టేట్ రౌడీ" దర్శకుడు విక్రమ్‌గాంధీని ఎంపికచేశారు. ఈ విషయమై గాంధీని ప్రస్తావించగా... ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయనీ, రెండు వర్షన్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయని త్వరలో మిగతా వివరాలను వెల్లడి చేస్తానని మంగళవారం నాడు చెప్పారు.