దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎనర్జీ: వెంకీ
|
చాక్లెట్ ఈజ్ మై ఎనర్జీ అన్నంతగా ఆయన చెప్పారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో 'తులసి' విడుదల సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తున్నారు. అప్పుడే వెళ్లిన ఓ విలేకరికి ఆయన ఏదో తినడం కన్పించింది. దీంతో సదరు విలేకరి వెంటనే వెనక్కువస్తుంటే...
'రండి.. రండి అంటూ ఇదేదో బిర్యానీ కాదు... సింపుల్ చాక్‌లెట్... తింటున్నాను. చాలామందితో ఇంటర్యూలు ఇచ్చి ఎనర్జీ అయిపోయింది. పైగా రాత్రంతా జర్నీ చేసి కాస్త అలసటగానూ ఉంది. 'తులసి' 12న విడుదల కాబట్టి టైమ్ లేకపోవటంతో ఈవేళ ఇంటర్య్యూలు ఇస్తున్నాను.
పోతే ఈ చాక్లెట్లంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు. కానీ ఎనర్జీకోసం తప్పదు అంటూ నవ్వులు కురిపించారు. ఆ వెంటనే కాస్త జండూబామ్‌ను కూడా తలకు పట్టిస్తూ, 'ఇది మాత్రం మీరు వస్తున్నారని కాదు. బడలికతో కాస్త తలనొప్పిగా ఉంటే ఇలా చేశాను. అపార్థం చేసుకోకండి' అని అక్కడి వాతావరణాన్ని చల్లగా మార్చేశారు.
వెంకటేష్ కుమారుడు అర్జున్ గురించి మాట్లాడుతూ... 'షూటింగ్ నుంచి వచ్చాక అర్జున్‌తో రిలాక్స్ అవుతాను. ఉదయమే స్కూలుకు పంపాను. మళ్లీ సాయంత్రం తీసుకువస్తానని చెప్పాను. వెళ్లాలి. లేకపోతే గొడవ చేస్తాడు' అన్నారు. ఎంత స్టార్ అయినా బుడతడు చెప్పింది వినాలిగా మరి...