1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తెలుగులో రానున్న "నేపాలీ"

తెలుగులో రానున్న నేపాలీ
భరత్, మీరాజాస్మిన్ హీరోహీరోయిన్లుగా తమిళంలో రూపొందిన "నేపాలీ" చిత్రాన్ని తెలుగులో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మహాగణపతి ఫిలింస్ బేనర్‌పై సుధాకర్‌బాబు చిత్రహక్కులు పొందినట్లు బుధవారం తెలిపారు.

ప్రముఖ దర్శకుడు ఆర్‌.బి. చౌదరి ఆశీస్సులతో ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను దసరానాడు ప్రారంభించనున్నట్లు సుధాకర్ బాబు వెల్లడించారు. దొరై దర్శకత్వం వహించిన ఈ చిత్రం "ఫ్యామిలీ ఎంటర్‌టైనర్" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా.
About Writer
Selvi