1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

లింగుసామి చిత్రంలో "రామ్‌చరణ్ తేజ"

లింగుసామి చిత్రంలో రామ్‌చరణ్ తేజ
నవతరం హీరో, మెగాస్టార్ పుత్రరత్నం, తొలి చిత్రంతోనే సంచలనం సృష్టిస్తున్న "చిరుత" రామ్‌చరణ్ తేజ తెలుగు హీరోల సంప్రదాయాన్ని అనుసరిస్తూ... తమిళ దర్శకుల చిత్రాల్లో నటించేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగులో విజయవంతమైన తమిళ అనువాద చిత్రాలైన "రన్", "పందెంకోడి" చిత్రానికి దర్శకత్వం వహించిన మాస్ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తేజ హీరోగా చిత్రాన్ని రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని తిరుపతి రాజా నిర్మిస్తున్నట్టు భాగ్యనగరం ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
About Writer
Selvi