శరవేగంగా.. నటి టబు చిత్రం షూటింగ్
|
మొత్తం ఐదు పాటలు ఉండే ఈ చిత్రంలో టబు ఓ గమ్మత్తైన పాత్రలో నటిస్తుండగా, రాజా ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. అక్టోబరు 25వ నుంచి నవంబరు నెలాఖరు వరకు జరిపే ఆఖరు షెడ్యూల్‌తో చిత్రం షూటింగ్ పూర్తవుతుందన్నారు. చైతన్య ప్రసాద్ రాసిన 'పట్టు చీర కట్టి పూలెట్టుకెళితే' అనే పాటను టబు, తదితరులపై చిత్రీకరించినట్టు చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, సునీల్, చలపతి రావు, కృష్ణమోహన్, సూర్య, సుమన్ శెట్టి, హేమ, అపూర్వ, మెల్కోటే, బేబి పూజా జాస్మిన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, కెఎన్.వై.పతంజలి, ఛాయాగ్రహణం.. జెకె.గుమ్మడి, ఎడిటింగ్.. రుద్ర.