1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్న శివ

నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్న శివ
సంవత్సరానికి ఒక సినిమాలోనే హీరోగా నటించడం అనేది తెలుగు హీరోలకు గగనమైపోతున్న ఈ రోజుల్లో... ఏకంగా నాలుగు చిత్రాల్లో నటించేందుకు నడుంబిగించాడు శివ జొన్నలగడ్డ. ఇందులో భాగంగా తెలుగు సినిమా అభిమానులపై "డాన్స్ ఎటాక్" చేస్తున్నారు.

డాన్స్ ఎటాక్ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి కొద్దిరోజులు కాకముందే "డాన్స్ చేద్దాం రా" అంటూ తెలుగు ప్రేక్షకులను ఊలలాడించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు శివ జొన్నలగడ్డ మీడియాతో అన్నారు. అంతేకాక మరో రెండు సినిమాలను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు.

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో బాలు, అనిల్, మల్లిక్, కిషన్‌కవాడి అనే సంగీత దర్శకుల్ని తెలుగుతెరకు పరిచయం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అదే విధంగా అతి తక్కువ కాలంలో అంటే 20 రోజుల్లో రికార్డింగ్ పూర్తి చేసి నవంబరు 14న "స్ట్రీట్ డాన్సర్" షూటింగ్ ప్రారంభించి, నాలుగు చిత్రాల పరంపరను మొదలు పెడతామని శివ జొన్నలగడ్డ తెలిపారు. ఈ సందర్భంగా నటుడు ప్రసన్న, వైభవ్ తమ పాత్రలను గురించి తెలియజేశారు.
About Writer
Selvi