1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మీడియాపై చిర్రుబుర్రులాడుతున్న కరిష్మాకోటక్

'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై మోడల్ కరిష్మాకోటక్
FileFILE
'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై మోడల్ కరిష్మాకోటక్. ఈ చిత్రంలో తన నటన కంటే.. శరీర అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తాజాగా ముంబై మీడియాపై చిర్రుబుర్రులాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బడా పారిశ్రామిక వేత్తతో ఓ రాత్రి పార్టీకి కరిష్మా ఒక్కటే హాజరుకావడమే.

ఈ విషయం తెలుసుకున్న ముంబై మీడియా కరిష్మా కోటక్‌కు వ్యతిరేకంగా పలు వార్తాకథనాలను ప్రచురించింది. దీంతో కరిష్మా మీడియాపై మండిపడుతోంది. నిజాలు తెలుసుకోకుండా.. వాళ్ళతో వీళ్ళతో లింకులు పెట్టి పలు రకాలుగా వార్తలు రాస్తున్నారని, అందుకే మీడియాతో మాట్లాడటమంటేనే భయంగా ఉందన్నారు. ముంబై వంటి మహానగరంలో తన కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంటికి పార్టీకి వెళ్లడం తప్పా అని ప్రశ్నిస్తోంది.
About Writer
PNR