నాన్నంటే ఇష్టం.. నా పెళ్లిని ఒప్పుకుంటారు: శ్రీజ
|
ఈ వివాహానంతరం శ్రీజ మీడియాతో మాట్లాడుతూ.. మేము మేజర్లు కాబట్టి మాకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. తొలుత ఈ వివాహాన్ని రిజిస్టర్ చేయించాలని అనుకున్నాం. అయితే.. ఆర్యసమాజ్ వారి నుంచి సరైన మద్దతు లభించడంతో పెళ్ళి అక్కడే చేసుకోవాలని నిర్ణయించామన్నారు. తన అక్క పెళ్ళికి తన వివాహానికి ఎలాంటి పోలిక లేదన్నారు. తాను ఇష్టపడ్డాను కనుకనే శిరీష్‌ను పెండ్లి చేసుకున్నాను. ఓ ఏడాదిగా తనను ఇంటిలో నిర్భంధించారని శ్రీజ చెపుతోంది.
దీనిపై వరుడు శిరీష్ మాట్లాడుతూ.. ఏడాది కాలంగా శ్రీజను కాలేజీ మాన్పించి గృహ నిర్భంధంలో ఉంచారన్నాడు. వివాహానంతరం ఆర్యసమాజా కార్యదర్శి బృహస్పతి మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన పేర్లు నమోదు చేసుకున్నారనీ, 17వ తేదీకి ఖరారు చేసుకున్నారని చెప్పారు. వివాహ ఆహ్వాన పత్రికను సమాజ్ వారు
|
సంప్రదాయబద్ధంగా వివాహం..
శ్రీజ-శిరీష్‌ల వివాహం రహస్యంగా జరిగినప్పటికీ.. సంప్రదాయబద్ధంగానే జరిగింది. అగ్నిహోమం చుట్టూ ఏడు అడుగులు నడిచారు. అనంతరం అరుంధతీ నక్షత్ర దర్శనం వంటివి సంప్రదాయబద్దంగానే జరిగాయి. అయితే. ఈ వివాహానికి శ్రీజ స్నేహితురాళ్లు ఎవరూ హాజరుకాలేదు. నాలుగేళ్ళుగా ప్రేమించుకున్న వీరిద్దరు వివాహానంతరం రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు.