తిరుపతిలో విష్ణు యాక్షన్ సన్నివేశాలు
గురువారం, 18 అక్టోబర్ 2007( 11:58 IST )
శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సంస్థ విష్ణు, నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తిరుపతిలో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ....
12 నుంచి తిరుపతిలో షూటింగ్ ప్రారంభమని చెప్పారు. ఇందులో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు తిరుపతిలో చిత్రీకరిస్తున్నామని అన్నారు. స్టణ్ శివ దర్శకత్వంలో 250మంది ఫైటర్లు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని ఆయన వివరాలందించారు. ఈ యాక్షన్ సన్నివేశం కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా ఎయిర్‌బెడ్స్ తెప్పించామని వెల్లడించారు.
దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి విష్ణు చేసే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని ఆయన చెప్పారు. ఇందులో నాగార్జున పాత్ర ఆద్యంతం ఉంటుందని.... అది ఏమిటనేది సస్పెన్స్ అని తెలిపారు. రెండు పాటలతో పాటు 30 శాతం టాకీ పూర్తయింది. విష్ణు కాలేజీ కుర్రాడిగా నటిస్తున్నాడు. మమతా మోహన్‌దాస్ హీరోయిన్‌గా నటిస్తోందని ఆయన చెప్పారు.