త్వరలో "సవాల్" ఆడియో విడుదల
గురువారం, 18 అక్టోబర్ 2007( 11:57 IST )
భరత్, సుహాని హీరోహీరోయిన్లుగా జయ దర్శకత్వంతో రూపొందుతోన్న చిత్రం "సవాల్". శ్రీ సాయిరూపాక్రియేషన్స్ పతాకంపై తోట వెంకటేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం 60శాతం పూర్తయ్యిందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మైసూర్ సమీపంలోని శ్రీరంగపట్టణంలో పాటల చిత్రీకరణ సాగుతుంది.
ఈ నెలాఖరువరకు అక్కడ మూడు పాటలను చిత్రిస్తామని దర్శకురాలు జయ చెప్పారు. నవంబర్ మొదటి వారంలో ముమైత్‌ఖాన్ సెట్లో ఓ గీతాన్ని తీస్తామని ఆమె వెల్లడించారు. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని తెలిపారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నామని తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ కుమార్, కళ: ఎస్. నాగేంద్రబాబు.