వివాహానంతరం కెరీర్‌ను కొనసాగించనున్న భూమిక
Publish: Fri, 19 Oct 2007 (15:08 IST)
Updated: Fri, 19 Oct 2007 (15:07 IST)
'
ఖుషి', 'మిస్సమ్మ' వంటి చిత్రాల్లో పాపులర్ అయిన హీరోయిన్ భూమిక. తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌తో ఈనెల 25వ తేదీన పెళ్లి చేసుకోనుంది. ముంబైలోని తన నివాసంలో జరిగే ఈ వివాహ కార్యక్రమ పనుల్లో ఆమె ప్రస్తుతం నిమగ్నమై ఉంది. అయితే.. పెళ్లి తర్వాత తన చిత్ర కెరీర్‌కు ఫుల్‌స్టాఫ్ పెట్టే యోచన లేదని భూమిక స్పష్టం చేసింది. కెరీర్ కొనసాగించడానికి మూడుముళ్ళ బంధం పెద్ద అడ్డంకి కాబోదని ఈ భామ నమ్ముతోంది. అందుకే వివాహానంతరం కూడా తన కెరీర్‌ను కొనసాగించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం భూమిక చేతిలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు పలు ఉన్నాయి.