1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఇలియానా-తరుణ్ చిత్రం ప్రారంభం

శ్రీ లక్ష్మీదేవీ ప్రొడక్షన్ పతాకంపై కె.విజయభాస్కర్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల
శ్రీ లక్ష్మీదేవీ ప్రొడక్షన్ పతాకంపై కె.విజయభాస్కర్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్ర తొలి షాట్‌ను హీరో హీరోయిన్లైన తరుణ్, ఇలియానాలపై చిత్రీకరించారు. దీనిపై దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. 'నువ్వేకావాలి' చిత్రం తర్వాత తరుణ్-విజయభాస్కర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉంటాయన్నారు. 'శివాజీ' చిత్రం తర్వాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం దర్శకుడు విజయభాస్కర్ మాట్లాడుతూ.. చక్కటి యూత్‌ఫుల్ చిత్రమని, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుందని చెప్పారు. చాలా గ్యాప్ తర్వాత విజయభాస్కర్‌తో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ కాంబినేషన్‌ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని తరుణ్ ధీమా వ్యక్తం చేశారు. హీరోయిన్ ఇలియానా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టు చెప్పారు.
About Writer
PNR